Leo Movie Review: రివ్యూ: లియో.. విజయ్‌, లోకేష్‌ కనగరాజ్‌ కాంబో మూవీ ఎలా ఉంది? (2024)

Leo Movie Review: విజయ్‌ కథానాయకుడిగా లోకేష్‌ కనగరాజ్‌ తెరకెక్కించిన లియో మూవీ మెప్పించిందా?

Published : 19 Oct 2023 14:01 IST

Leo Movie Review; చిత్రం: లియో; నటీనటులు: విజయ్‌, సంజయ్‌ దత్‌, త్రిష, అర్జున్‌, గౌతమ్‌ వాసుదేవ్‌ మేనన్‌, మిస్కిన్‌, మన్సూర్‌ అలీఖాన్‌, ప్రియా ఆనంద్‌, మాథ్యూ థామస్‌, శాండీ మాస్టర్‌, బాబూ ఆంటోనీ, మనోబాల, జార్జ్‌ మరియన్‌, అభిరామ్‌ వెంకటాచలం తదితరులు; సంగీతం: అనిరుధ్‌ రవిచందర్‌; సినిమాటోగ్రఫీ: మనోజ్‌ పరమహంస; ఎడిటింగ్‌: ఫిలోమిన్‌ రాజ్‌; బ్యానర్‌: సెవెన్‌ స్క్రీన్‌ స్టూడియో; నిర్మాత: ఎస్‌.ఎస్‌.లలిత్‌ కుమార్‌, జగదీష్‌ పళణిస్వామి; రచన: లోకేష్‌ కనగరాజ్‌, రత్నకుమార్‌, ధీరజ్‌ వైదీ; దర్శకత్వం: లోకేష్‌ కనగరాజ్‌; విడుదల: 19-10-2023

‘ఖైదీ’, ‘విక్రమ్‌’ చిత్రాలతో భారతీయ చిత్ర పరిశ్రమలో మంచి గుర్తింపు తెచ్చుకున్న దర్శకుడు లోకేష్‌ కనగరాజ్‌. ఇక విజయ్‌ నటించిన పలు తమిళ చిత్రాలు ఇటీవల వరుసగా తెలుగులోనూ విడుదలవుతున్నాయి. వీరిద్దరి కాంబినేషన్‌లో వచ్చిన ‘మాస్టర్‌’ మెప్పించగా, తాజాగా ‘లియో’తో మరోసారి ప్రేక్షకుల ముందుకు వచ్చారు. (Leo Movie Review) లోకేష్‌ సినిమాటిక్‌ యూనివర్స్‌(ఎల్‌సీయూ)లో ఈ సినిమా భాగంగా ఉంటుందా? ప్రత్యేక చిత్రమా? అంటూ మొదలైన చర్చ ‘లియో’పై అంచనాలను పెంచింది. మరి ఈ మూవీ ఆ అంచనాలను అందుకుందా? విజయ్‌-లోకేష్‌ల కాంబో మెప్పించిందా?

Leo Movie Review: రివ్యూ: లియో.. విజయ్‌, లోకేష్‌ కనగరాజ్‌ కాంబో మూవీ ఎలా ఉంది? (1)


క‌థేంటంటే: పార్తి అలియాస్ పార్తిబ‌న్ () హిమాచ‌ల్ ప్ర‌దేశ్‌లోని థియోగ్‌లో స్థిర‌ప‌డిన తెలుగువాడు. ఓ కేఫ్ న‌డుపుకొంటూ 20ఏళ్లుగా అక్క‌డే కుటుంబంతో క‌లిసి జీవనం సాగిస్తుంటాడు. అత‌ని భార్య స‌త్య (). వీరిది ప్రేమ వివాహం. వీరి ప్రేమ‌కు గుర్తుగా ఓ బాబు.. పాప. హాయిగా.. సంతోషంగా సాగిపోతున్న‌ పార్తి జీవితం ఓ క్రిమిన‌ల్‌ ముఠా వ‌ల్ల‌ త‌ల‌కిందుల‌వుతుంది. ఓ రాత్రి త‌న కేఫ్‌లోకి వ‌చ్చి డ‌బ్బులు దోచుకెళ్లే ప్ర‌య‌త్నం చేసిన ఆ ముఠాను అక్క‌డిక్క‌డే కాల్చి చంపేస్తాడు పార్తి. దీంతో పోలీసులు అత‌న్ని అరెస్టు చేస్తారు. (Leo Movie Review) అయితే త‌ను ఆత్మ‌ర‌క్ష‌ణ కోస‌మే వాళ్ల‌ను చంపిన‌ట్లు కోర్టులో తేల‌డంతో నిర్దోషిగా విడుద‌ల‌వుతాడు. కానీ, ఓ వార్తా ప‌త్రిక‌లో అత‌ని ఫొటో చూసిన ఆంటోని దాస్‌ (సంజ‌య్ ద‌త్‌) గ్యాంగ్ పార్తిని వెతికి ప‌ట్టుకొని.. చంపేందుకు హిమాచ‌ల్‌ప్ర‌దేశ్‌కు బ‌య‌లుదేరుతుంది. దీనికి కార‌ణం 20ఏళ్ల క్రితం క‌నిపించ‌కుండా పోయిన ఆంటోని కొడుకు లియోలా పార్తిబ‌న్ ఉండ‌ట‌మే. మ‌రి ఈ లియో ఎవ‌రు? అత‌ను.. పార్తిబ‌న్ ఒక్క‌డేనా?లేక ఇద్ద‌రా? సొంత కొడుకునే చంపాల‌ని ఇటు లియో తండ్రి ఆంటోని, అత‌ని అన్న హెరాల్డ్ దాస్ (అర్జున్‌) ఎందుకు ప్ర‌య‌త్నిస్తుంటారు? వీళ్ల‌కు లియోకూ ఉన్న వైరం ఏంటి?పార్తి గ‌త‌మేంటి? ఆంటోని గ్యాంగ్ నుంచి త‌న కుటుంబాన్ని కాపాడుకునేందుకు ఏం చేశాడు? అన్న‌ది తెర‌పై చూసి తెలుసుకోవాలి.

ఎలా సాగిందంటే: ఇది లోకేష్ క‌న‌గ‌రాజ్ సినిమాటిక్ యూనివ‌ర్స్‌లో భాగంగా వ‌చ్చిన చిత్ర‌మైనా.. ‘ఖైదీ’, ‘విక్ర‌మ్’ క‌థ‌లతో దీనికి పెద్ద‌గా లింక్ ఉండ‌దు. ఈ క‌థ వాటికి పూర్తి భిన్నంగా సాగుతుంది. ‘ఖైదీ’లో ఉన్న నెపోలియ‌న్ పాత్రను దీంట్లో చూపించ‌డం.. ఆంటోని దాస్‌ టీమ్ చేసే పొగాకు వ్యాపారం.. ఆఖ‌రిలో విక్ర‌మ్‌గా క‌మ‌ల్‌హాస‌న్ లియోతో ఫోన్లో మాట్లాడ‌టం వంటి కొన్ని అంశాలే ఇది లోకేష్ యూనివ‌ర్స్‌లో భాగం అనిపించే భావ‌న క‌లిగించేలా చేస్తాయి. అంతే త‌ప్ప మిగ‌తా క‌థ‌నంలో ఎక్క‌డా ఆ ఛాయ‌లు క‌నిపించ‌వు.(Leo Movie Review in telugu) ఓ క్రిమిన‌ల్ ముఠా ఒక క‌లెక్ట‌ర్‌ను హ‌త్య చేసి త‌ప్పించుకునే ఎపిసోడ్‌తో సినిమాని ఆస‌క్తిక‌రంగా ప్రారంభించారు ద‌ర్శ‌కుడు లోకేష్‌. ఆ వెంట‌నే హైనాతో త‌ల‌ప‌డే ఓ యాక్ష‌న్ సీక్వెన్స్‌తో పార్తిబ‌న్ పాత్ర‌లో విజ‌య్‌ను ప‌రిచ‌యం చేశారు. ఈ ఎపిసోడ్ ప్ర‌థమార్ధానికి ఆక‌ర్ష‌ణ‌గా నిలుస్తుంది. అక్క‌డి నుంచి పార్తి కుటుంబాన్ని.. భార్యాపిల్ల‌ల‌తో అత‌ని అనుబంధాన్ని చూపిస్తూ సినిమాని ముందుకు తీసుకెళ్లారు. దీంతో క‌థ కాస్త నెమ్మ‌దిగా సాగుతున్న అనుభూతి క‌లుగుతుంది.

Leo Movie Review: రివ్యూ: లియో.. విజయ్‌, లోకేష్‌ కనగరాజ్‌ కాంబో మూవీ ఎలా ఉంది? (2)

పార్తి కేఫ్‌లోకి క్రిమిన‌ల్ ముఠా ప్ర‌వేశించ‌డం.. వారితో అత‌ను త‌ల‌పడ‌టం.. కూతుర్ని కాపాడుకునే క్ర‌మంలో వాళ్లంద‌ర్నీ కాల్చి చంప‌డం.. ఈ యాక్ష‌న్ ఎపిసోడ్ అంతా ఆక‌ట్టుకుంటుంది. ఇక్క‌డి నుంచే క‌థ మ‌లుపు తిరుగుతుంది. లియోని వెతుక్కుంటూ ఆంటోని దాస్ గ్యాంగ్ హిమాచ‌ల్ ప్ర‌దేశ్‌కు వ‌చ్చిన‌ప్ప‌టి నుంచి క‌థలో సంఘ‌ర్ష‌ణ మొద‌ల‌వుతుంది.(Leo Movie Review) ఆంటోని దాస్ పాత్ర‌లో సంజ‌య్ ద‌త్‌ను, హెరాల్డ్ దాస్ పాత్ర‌లో అర్జున్‌ను ప‌రిచ‌యం చేసిన తీరు ఆక‌ట్టుకుంటుంది. తొలిసారి పార్తీ, ఆంటోని ఎదురుప‌డే స‌న్నివేశాలు ఆకట్టుకుంటాయి. విరామానికి ముందొచ్చే రెండు యాక్ష‌న్ సీక్వెన్స్ అల‌రిస్తాయి. ముఖ్యంగా ఆంటోనికీ.. పార్తికీ మ‌ధ్య వ‌చ్చే ఛేజింగ్ ఎపిసోడ్ ఆక‌ట్టుకుంటుంది. పార్తిబ‌న్‌, లియో ఒక్క‌రా.. ఇద్ద‌రా? అనే పాయింట్ చుట్టూ ద్వితీయార్ధం సాగుతుంది. లియో పాత్ర గ‌తం.. తండ్రీ, అన్న‌తో వైరం ఏర్ప‌డ‌టానికి కార‌ణం.. అంత ఆస‌క్తిక‌రంగా అనిపించ‌దు. అయితే వీళ్ల మ‌ధ్య వ‌చ్చే యాక్ష‌న్ ఎపిసోడ్ మెప్పిస్తుంది. ప్రీక్లైమాక్స్‌లో త‌న భార్యాబిడ్డ‌ల్ని చంప‌డానికొచ్చిన ఆంటోని గ్యాంగ్‌ను పార్తి త‌న ట్రాప్‌తో చంపే తీరు ఆక‌ట్టుకుంటుంది. క్లైమాక్స్‌లో హెరాల్డ్ దాస్‌కూ పార్తికీ మ‌ధ్య వ‌చ్చే యాక్ష‌న్ ఎపిసోడ్ కాస్త సాగ‌దీత‌గా అనిపిస్తుంది. ‘విక్ర‌మ్‌’, ‘ఖైదీ’ చిత్రాల క్లైమాక్స్‌లో ఉన్నంత మెరుపు ఈ చిత్ర ముగింపులో క‌నిపించ‌దు.

ఎవ‌రెలా చేశారంటే: విజ‌య్ ఇందులో పార్తిబ‌న్‌, లియోగా రెండు కోణాలున్న పాత్ర‌ల్లో క‌నిపించారు. ఈ రెండింటికీ మ‌ధ్య ఉన్న వ్య‌త్యాసాన్ని చ‌క్క‌గా చూపించారు. ఇద్ద‌రు పిల్ల‌ల తండ్రిగా పార్తి పాత్ర‌లో విజ‌య్ క‌నిపించిన తీరు.. ఆయ‌న లుక్‌, గెట‌ప్ ఆక‌ట్టుకుంటాయి. ఇక లియోగా ప్ర‌తినాయ‌క ఛాయ‌లున్న పాత్ర‌లో చ‌క్క‌టి హీరోయిజాన్ని చూపించారు. త‌ల్లి పాత్ర‌లో త్రిష చ‌క్క‌గా ఒదిగిపోయింది. క‌థ‌లో ఆమెకున్న ప్రాధాన్య‌త త‌క్కువే అయినా క‌నిపించిన ప్ర‌తి సీన్‌లో త‌న‌దైన న‌ట‌న‌తో ఆక‌ట్టుకుంటుంది. (Leo Movie Review) విజ‌య్‌తో ఆమె కెమిస్ర్టీ బాగుంది. ఆంటోని దాస్‌గా సంజ‌య్ ద‌త్‌, హెరాల్డ్ దాస్‌గా అర్జున్ శ‌క్తిమంత‌మైన పాత్ర‌ల్లో క‌నిపించారు. వాళ్ల పాత్ర‌ల్ని చిత్రీక‌రించిన తీరు ఆక‌ట్టుకుంటుంది. అయితే ఆ పాత్ర‌ల్ని ముగించిన తీరు ఏమాత్రం సంతృప్తిక‌రంగా అనిపించ‌దు. గౌత‌మ్ మేన‌న్‌, మ‌న్సూర్ అలీ ఖాన్‌, ప్రియా ఆనంద్ త‌దిత‌రుల పాత్ర‌లు ప‌రిధి మేర‌కే ఉన్నాయి.

లోకేష్ ఈసారి త‌న క‌థ‌లో యాక్ష‌న్ డోస్ కాస్త త‌గ్గించి ఫ్యామిలీ ట‌చ్ ఇచ్చే ప్ర‌య‌త్నం చేశారు. క‌థ‌ను ఆరంభించిన విధానం.. ప్ర‌థమార్ధాన్ని న‌డిపిన తీరు బాగున్నాయి. ద్వితీయార్ధంలో కొంత భాగం మాత్రం సాగ‌తీత వ్య‌వహారంలా అనిపిస్తుంది. ముఖ్యంగా సంజయ్‌దత్‌ వ్యవహారశైలి, అనుసరించే పద్ధతులు అంతగా ఆకట్టుకోవు. చివరిలో విక్రమ్‌ (క‌మ‌ల్ హాసన్‌) లియోకు ఫోన్ చేసి మాట్లాడిన‌ట్లు చూపించారు కానీ, అదంతగా ప్రేక్ష‌కుల‌కు కిక్ ఇవ్వ‌దు. కానిస్టేబుల్‌ నెపోలియ‌న్ పాత్ర మాత్రం మ‌రోసారి మెప్పిస్తుంది. అనిరుధ్ నేప‌థ్య సంగీతం ప్రతి సన్నివేశాన్ని ఎలివేట్‌ చేసింది. ముఖ్యంగా యాక్షన్‌ సీక్వెన్స్‌ను మరింత ఇంటెన్సిటీ తెచ్చింది. మ‌నోజ్ ప‌ర‌మ‌హంస సినిమాటోగ్రఫీ సినిమాకి ప్ర‌ధాన ఆక‌ర్ష‌ణ‌. (Leo Movie Review) యాక్షన్‌ సీక్వెన్స్‌లో సినిమాటోగ్రఫీ టాప్‌నాచ్‌ అని చెప్పవచ్చు. ముఖ్యంగా కారు ఛేజింగ్‌ సీన్స్‌, దాస్‌ అండ్‌ కో కంపెనీని లియో తగలబెట్టే ముందు వచ్చే యాక్షన్‌ సీక్వెన్స్‌లో తీసిన షాట్స్‌ వావ్‌ అనిపిస్తాయి. అన్బుఅరివు పోరాట ఘ‌ట్టాలు ఆక‌ట్టుకుంటాయి. ప్రతి యాక్షన్‌ సీన్‌ డిఫరెంట్‌గా ఉండేలా డిజైన్‌ చేసుకున్నారు. గన్‌ను చేతిపై రోల్‌ చేస్తూ విజయ్‌ చేసే గెశ్చర్‌కు థియేటర్‌లో విజిల్స్‌ పడతాయి. నిర్మాణ విలువ‌లు ఉన్న‌తంగా ఉన్నాయి.

  • బ‌లాలు
  • + విజ‌య్ న‌ట‌న‌
  • + హైనాతో ఫైట్ సీక్వెన్స్‌, ఫ్లాష్‌బ్యాక్‌లో ఫైట్‌ సీన్స్‌
  • + విరామ స‌న్నివేశాలు
  • బ‌ల‌హీన‌త‌లు
  • - ద్వితీయార్ధం కొన్ని సన్నివేశాలు
  • - ముగింపు
  • చివ‌రిగా: యాక్ష‌న్ ప్రియుల్ని మెప్పించే లియో (Leo Movie Review in telugu)
  • గమనిక: ఈ సమీక్ష సమీక్షకుడి దృష్టి కోణానికి సంబంధించింది. ఇది సమీక్షకుడి వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే!

Read latest Movies News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

  • Movie Review
  • Telugu Movie Review
  • Trisha
  • Vijay

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

Leo Movie Review: రివ్యూ: లియో.. విజయ్‌, లోకేష్‌ కనగరాజ్‌ కాంబో మూవీ ఎలా ఉంది? (2024)

References

Top Articles
Latest Posts
Article information

Author: Geoffrey Lueilwitz

Last Updated:

Views: 6230

Rating: 5 / 5 (60 voted)

Reviews: 91% of readers found this page helpful

Author information

Name: Geoffrey Lueilwitz

Birthday: 1997-03-23

Address: 74183 Thomas Course, Port Micheal, OK 55446-1529

Phone: +13408645881558

Job: Global Representative

Hobby: Sailing, Vehicle restoration, Rowing, Ghost hunting, Scrapbooking, Rugby, Board sports

Introduction: My name is Geoffrey Lueilwitz, I am a zealous, encouraging, sparkling, enchanting, graceful, faithful, nice person who loves writing and wants to share my knowledge and understanding with you.